Type Here to Get Search Results !

Telangana May 2018 Current Affairs In Telugu (తెలంగాణ మే 2018 కరెంట్ అఫైర్స్)

రైతు బంధు పథకం ప్రారంభం (10 May, 2018) [Raitubandu Padakam]
రైతులకు పెట్టుబడి సాయం చేసేందుకు చేపట్టిన రైతు బందు పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కే సి ర్  మే 10 న కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం శాలపల్లి ఇందిరానగర్ లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవంలో ధర్మరాజు గ్రామానికి చెందిన 10 మంది రైతులకు పాసుబుక్కులు, పెట్టుబడి సాయం చెక్కులను అందచేశారు. 

కొత్తగూడెం లో మరో విద్యుత్ కేంద్రం
కొత్తగూడెంలో 800 మెగావాట్ల సామర్ధ్యంతో సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర విద్యుతుత్పత్తి సంస్థ (TSGENCO)  మే 2 న తెలిపింది. 

తెలుగు లో ధరణి వెబ్ సైట్ (Available Dharani Web Site in Telugu)
తెలంగాణాలో భూ రికార్డుల సమీకృత నిర్వహణ కోసం రూపొందిస్తున్న 'ధరణి' వెబ్ సైట్ ను తెలుగులోను అందుబాటులోకి తేనున్నారు.  గ్రామీణ రైతులకు సులువుగా అర్ధం అయేందుకు మే 8 న తెలంగాణ ప్రభుత్వం దీనిని ప్రారంభించింది.

ఇంటర్నేషనల్ యంగ్ సైంటిస్ట్ కాంగ్రెస్ 2018  [International Young Scientist Congress-2018]
నాల్గవ ఇంటర్నేషనల్ యంగ్ సైంటిస్ట్ కాంగ్రెస్ 2018 ని మే 8, 9 తేదీల్లో తిరుపతి లో నిర్వహించారు. రాజస్థాన్ కు చెందిన రాజేష్ కుమార్ మీనా కు యంగ్ సైంటిస్ట్ అవార్డు లభించింది. తదుపరి ఇంటర్నేషనల్ యంగ్ సైంటిస్ట్ కాంగ్రెస్ ను నేపాల్ లో నిర్వహించనున్నారు. 

త్వరలో 'తెలంగాణ కంటి వెలుగు' కార్యక్రమం  [Telangana Kanti Velugu]
తెలంగాణ లో కంటి సమస్య లతో బాధపడుతున్నవారిని గుర్తించి తగిన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 'తెలంగాణ కంటి వెలుగు' కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. కార్యక్రమం అమలు కోసం రూ.106  కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం మే 14 న పధకం మార్గదర్శకాలను విడుదల చేసింది.

తెలంగాణ లో క్రీడాకారులకు 2% రిజర్వేషన్ [2% Reservation in Sports Quota in Telangana]
విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం మే 14 న ఉత్తర్వులు (జి.ఓ. నెం.5) జారీ చేసింది. ఈ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రిజర్వేషన్ చట్టం రూల్-22 ను సవరించింది. ప్రస్తుతం పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ అమలు చేస్తుండగా తెలంగాణ 3వ రాష్ట్రంగా నిలవనుంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad